వేద న్యూస్, కేయూ క్యాంపస్:
కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగంలో ఆచార్య సి.శివరామకృష్ణ రావు 10 సంవత్సరాల యాది సభను అర్థశాస్త్ర విభాగం సెమినార్ హాల్లో విభాగాధిపతి ఆచార్య సురేష్ లాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య సురేష్ లాల్ మాట్లాడుతూ ఆచార్య శివరామ కృష్ణారావు గొప్ప మానవతావాది, అజాతశత్రువని తెలిపారు. సార్ విలువలను నేడు విభాగంలో కొనసాగిస్తూనే ఉన్నామన్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ఆచార్య పాపిరెడ్డి మాట్లాడుతూ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు అదే సార్ యొక్క ప్రత్యేకతని తెలిపారు. సామాజిక న్యాయం సార్ ద్వారానే సాధ్యమైందని ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులకు లాభం చేకూరిందని తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ఆచార్య ఇక్బాల్ అలీ మాట్లాడుతూ సార్ పేరులో శివ రామ కృష్ణ అనే మూడు పదాలు ఉన్నాయని ఆపదాల వల్ల గొప్ప మేధావిగా పేరు పొందారన్నారు. గర్వం, అహంకారం, లేని వ్యక్తిత్వం సారుదని తెలిపారు. ఆచార్య విజయ మాట్లాడుతూ ఐదుగురు అర్థశాస్త్రవేత్తలు కూర్చుంటే ఆరవ ఆలోచన వస్తుందని దానికి నిదర్శనం సార్ అని తెలిపారు. ఆచార్య జ్యోతిరాణి మాట్లాడుతూ ప్రగతిశీల మహిళా ప్రజాస్వామ్య ఉద్యమాలకు సార్ కారణమని మానవీయ విలువలకు స్ఫూర్తికి సమాజ చైతన్యానికి సార్ ఆలోచనలు చేసేవారు అన్నారు. క్షేత్ర పర్యటన ద్వారా అర్థశాస్త్ర విభాగములో, సమాజంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలి అనేవారు. విలువలతో కూడిన ఉన్నత విద్యను పొంది ఉన్నత సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని చెప్పే వారన్నారు. ఆచార్య మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు నిలువెత్తు నిదర్శనం పెద్దసారు అని కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగానికి సార్ పితామహుడని తెలిపారు. ఆచార్య ఎర్రగట్టు స్వామి మాట్లాడుతూ సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి అని, సార్ పేరును అర్థశాస్త్ర విభాగపు సెమినార్ హాల్ కు పెట్టాలని తెలిపారు. డాక్టర్ వెంకటయ్య డాక్టర్ విగ్నేశ్వర్ ఆచార్య కనకాచారి ఆచార్య మనోజాదేవి ఆచార్య సుదర్శన్ డాక్టర్ సాంబశివరావు డాక్టర్ రాజేష్ డాక్టర్ రమేష్ డాక్టర్ శ్రీధర్ కుమార్ లోద్ లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విద్యాసాగర్ డాక్టర్ నవీన్ డాక్టర్ రవీందర్ డాక్టర్ కుమార్ డాక్టర్ కవిత డాక్టర్ సంధ్య డాక్టర్ విజయ డాక్టర్ కవిత తో పాటు శివరామకృష్ణ సార్ విద్యార్థులు స్కాలర్లు అధ్యాపకులు బోధ నేతల సిబ్బంది కొమరమ్మ గోపి విజయ్ అర్థశాస్త్ర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.