వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:
సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి జనంలోకి విస్తృతంగా వెళుతున్నారు. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మమతకు ప్రజలు ఆశీర్వచనాలు అందజేస్తున్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఆమె బరిలోకి దిగగా, యువతరం ఆలోచన శక్తి కలిగిన ప్రజలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నట్టు పలువురు పేర్కొన్నారు.
ప్రధాన పార్టీల అభ్యర్థులను కాదని ప్రత్యామ్నాయంగా ఆలోచన శక్తితో.. అభివృద్ధి యే ధ్యేయంగా ముందుకు వస్తున్న … యువ నాయకులకు జనం అండదండలు అత్యంత ముఖ్యమని ఈ సందర్భంగా గ్రామస్తులు కొందరు తెలిపారు. ఈ క్రమంలోనే దేశం కోసం సేవలందిస్తున్న జవాను సతీమణి మమత సర్పంచ్ అభ్యర్థిగా ఓట్లు అడుగుతున్న క్రమంలో చక్కటి స్పందన వస్తున్నట్లు పలువురు తెలిపారు.
బలమైన ప్రభావం చూపడమే కాకుండా ప్రధాన పార్టీల ఓట్లకు “కత్తెర”పడి.. ప్రజల కోసమే పని చేసే అభ్యర్థికి చేరువయ్యే అవకాశాలు నిండుగా మెండుగా కనిపిస్తున్నాయని జనసేన కార్యకర్తలు పేర్కొంటున్నారు. జనం కోసం జనంలోకి వెళ్తున్న మమత కు ప్రజల అండదండలు విశేషంగా ఉన్నాయని జనసైనికులు వెల్లడిస్తున్నారు. ఎన్నికలలో భాగంగా జనసైనికులు విశేష కృషి చేస్తున్నారు. అభ్యర్థి తామే అన్నట్టుగా అన్ని పనులు భుజాల మీదుగా మోస్తూ.. బలమైన ప్రభావం చూపించే దిశగా విజయ మే ధీమాగా ముందుకెళున్నారు.


