వేద న్యూస్, వరంగల్ :

గ్రేటర్ వరంగల్ చౌర్బౌలి ప్రాంతంలోని పద్మశాలి కల్యాణ మండపంలో గురువారం అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పద్మశాలి కల్యాణ మండపం నిర్వాహకుడు కొంతం వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించారు.
గత పది సంవత్సరాలుగా అయ్యప్ప స్వాముల భక్తి, సేవా భావంతో ఈ బిక్ష కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తూ రావడం విశేషం. ఈ ఏడాది కూడా సుమారు 300 మంది అయ్యప్ప స్వాములు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వాములందరికీ శ్రద్ధాభక్తులతో అన్నదానం, మరియు ఇతర అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక అయ్యప్ప స్వామిలు, భక్తులు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాలుగోన్నారు.