వేద న్యూస్, వరంగల్ టౌన్:
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన ఓరుగల్లు విజయసంకల్ప సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం వరంగల్ జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా బిజెపి యువ నాయకులు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే బిజెపి అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు అభిమాని అజయ్ గౌడ్ అమిత్ షా కు ఘన స్వాగతం పలికారు. ఆనంతరం అజయ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే బిజెపి అధికారంలోకి రావాల్సిందే అని అన్నారు. వరంగల్ తూర్పు గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.