వీధి కుక్కల స్వైరవిహారం..ఇద్దరు చిన్నారులు, ఓ వృద్ధుడికి గాయాలు

వేద న్యూస్,బోయినిపల్లి;

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో వీధి కుక్కల దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఒక వృద్ధుడు, తీవ్రంగా గాయపడ్డారు.

ఆదివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో చిన్నారులు, బయట ఆడుకుంటుండగా పిచ్చి,కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో 7 సంవత్సరాల బాలిక నక్క కావ్య, తండ్రి వేణు, తీవ్రంగా గాయపడి చేతి ఎముక విరిగింది. అలాగే 6 సంవత్సరాల పిల్లి అపర్ణిక తండ్రి వెంకటేష్, ఈ ఇద్దరు పిల్లలు,తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి, తరలించి చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో తీర్థాల కనకయ్య అనే వ్యక్తి పై కూడా కుక్కలు, దాడి, చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. బాధితుల,పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.దాదాపు మూడు కుక్కలకు రేబిస్ వ్యాధి, సోకినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే గ్రామ సర్పంచ్, ఇరువాలా సంధ్యా-మహేందర్,పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులతో కలిసి చర్యలు, చేపట్టారు. ప్రమాదకరంగా మారిన కుక్కలను, పట్టుకునే ప్రయత్నం చేశారు.ఇంకా ఒక రేబిస్,అనుమానిత కుక్క, గ్రామంలో సంచరిస్తున్నట్లు సమాచారం. గ్రామస్థులు, అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సూచించారు.

గ్రామంలో భయాందోళన

ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. చిన్నారులు,బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారులు, తక్షణ చర్యలు తీసుకుని గ్రామంలో వీధి కుక్కల,సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు, కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *