వేద న్యూస్, వరంగల్ టౌన్:
వరంగల్ రామన్నపేటలోని డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తవాడలో గత పది సంవత్సరాల నుండి తీపి మొక్కజొన్న కంకులు ఉడికించి అమ్ముతున్నటువంటి శ్రీలతను మరియు పోచమ్మ మైదాను వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో గత కొంత కాలం నుంచి పనిచేస్తున్నటువంటి మొలుగూరి శ్రీదేవిని ట్రస్టుచే శాలువా మరియు బొకేతో ఘనంగా వారు వారి పనులు చేస్తున్నటువంటి ప్రాంతంలోనే సన్మానించారు.
ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రష్టి డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మహిళలు మేమున్నామంటూ ముందుకు వస్తూ అన్ని రంగాలలో రాణిస్తూ పురుషులకు సమానంగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఇద్దరిని సన్మానించారు. అలాగే వీరిని స్ఫూర్తిగా తీసుకొని మహిళలందరూ స్వశక్తితో ఏదో ఒక వ్యాపారం చేస్తూ సంసారాన్ని సాగిస్తూ పిల్లలను వారి వారి మనవళ్లను, మనవరాళ్లను సుఖ సంతోషంగా ఉంచుతూ సంతోష జీవనం గడపాలని తెలియజేశారు. సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ మమ్ములను గుర్తించి ఈ విధంగా మేము చేస్తున్న పనుల వద్దకే వచ్చి సన్మానించడం అనేది సంతోషము అలాగే అబ్రపరిచిందని అన్నారు. దీనివల్ల మాకు ఇంకా ఎంతో ఉత్సాహంగా పనిచేయాలని కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్ తో పాటు ఆర్గనైజర్ శ్రవణ్, మెంబర్స్ శైలజ, రామ శ్రీనివాస్, నల్ల సత్యనారాయణ, మోహన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
