= పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ దేదీప్య
వేద న్యూస్, బోయినిపల్లి:
గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ దేదీప్య కోరారు. రేపు ఉదయం 9 గంటలకు విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ శిబిరంలో స్త్రీరోగ నిపుణులు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, కంటి వైద్యులు, దంత వైద్యులు, ఎముకల నిపుణులు, జనరల్ వైద్యులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. మండల పరిధిలోని గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఆరోగ్య సమస్యలకు పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.