= డిప్యూటీ కలెక్టర్ పుల్లూరి జగదీశ్వర్ రావు
వేద న్యూస్, చొప్పదండి:
పెద్దపల్లి జిల్లా వడ్కాపూర్‌కు చెందిన ఖమ్మం డిప్యూటీ కలెక్టర్ పుల్లూరి జగదీశ్వర్ రావు తాను చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వడ్కాపూర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జీవితంలో ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించే దిశగా కృషి చేయాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ప్రస్తుతం విద్యార్థులకు సాంకేతిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా చదివి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు. విద్యార్థులు ఏ రంగం ఎంచుకున్నా అందులో నంబర్ వన్‌గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.