వేద న్యూస్, రామడుగు:
మండలంలోని కొక్కెరకుంట గ్రామానికి చెందిన ఎన్నారైలు తౌట్ అజిత్ రెడ్డి, పబ్బతి శ్యామ్ కుమార్ రెడ్డి సహకారంతో యువజన అవార్డు గ్రహీత గజ్జెల అశోక్ కుమార్ చొరవతో రూ.25 వేల వ్యయంతో కొనుగోలు చేసిన నీటి శుద్ధి యంత్రాన్ని గురువారం గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాలకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ వేముల కుమార్, మాజీ ఎంపీపీ జవ్వాజి హరీష్ పాల్గొన్నారు.