వేద న్యూస్, కోటగిరి :
కోటగిరి మండల కేంద్రంలోని పెద్ద హనుమాన్ ఆలయంలో గురువారం పరాభవ నామ ఉగాది వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. వేద పండితులు రాజేశ్వర్ జోషి మహరాజ్ ఆధ్వర్యంలో నూతన పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో రైతులకు, పాడి, వ్యవసాయ రంగాలకు మంచి లాభదాయకం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.