వేద న్యూస్,బోయినిపల్లి :
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం, విలాసాగర్, గ్రామంలో తెలుగు నూతన పరాభవ నామ సంవత్సరం, సందర్భంగా విలాసాగర్ లోని విశ్వబ్రాహ్మణ సంఘం, ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, కార్యక్రమం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో విలాసాగర్ గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, ని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం, మండల అధ్యక్షుడు పాలోజు జగన్, ఇల్లంతకుంట వెంకట నర్సయ్య, చిలుముల సుదర్శన్, ఇల్లంతకుంట పట్టాభిరాములు, ఇల్లంతకుంట వెంకటాచారి, ఇల్లంతకుంట ఆంజనేయులు, ఇల్లంతకుంట వెంకటరమణ, జయప్రకాష్ తదితరులు పాల్గొని నూతన సంవత్సరం సందర్భంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.