వేద న్యూస్,వేములవాడ ప్రతినిధి:

శ్రీరామ్ హనుమాన్ సేన ఆధ్వర్యంలో సనాతన పంచాంగాన్ని అనుసరించి ఉగాది నుండి ఉగాది వరకు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది.. శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం భీమేశ్వర స్వామి సన్నిధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాసాలును,పక్షాలను, తిదిలను, నక్షత్రాలను.. సులువుగా తెలుసుకునే విధంగా క్యాలెండర్ ను రూపొందించడం జరిగిందని.. వ్యవస్థాపక అధ్యక్షులు పల్లెర్ల శేఖర్ తెలియచేసారు .. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చల్ల జితేందర్ రెడ్డి, కొలిపాక అనిల్, విగ్నేష్, చరణ్, తదితరులు పాల్గొన్నారు