• వేములవాడ ఏరియా హాస్పిటల్‌లో దారుణ పరిస్థితులు
  • గంటల తరబడి క్యూ లో ప్రజల అవస్థలు
  • డాక్టర్ లు సమయానికి రాక పెషేంట్ ల ఇబ్బందులు

వేద న్యూస్, ప్రత్యేక ప్రతినిధి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో పేషెంట్ల పరిస్థితి రోజురోజుకూ ఇబ్బందికరంగా మారుతోంది. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే ప్రజలు ముందుగా ఓపీ (op) తీసుకోవడానికి గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఓపీ తీసుకున్న తర్వాత డాక్టర్ వద్దకు వెళ్తే, అక్కడ డాక్టర్లు లేక ఖాళీ కుర్చీలు మాత్రమే దర్శనమిస్తున్నాయని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పలు రకాల జబ్బులతో వచ్చిన పేషెంట్లు డాక్టర్ల కోసం ఎదురుచూస్తూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది డాక్టర్లు మధ్యాహ్నం 12 లేదా 1 గంట దాటినా విధులకు హాజరుకావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొన్ని విభాగాల్లో పెషేంట్ లు ఎక్కువగా ఉండి ఒక్క డాక్టర్ మాత్రమే ఉండడం వల్ల పేషెంట్లను అందరిని చూడలేకపోతున్నారు.

దీంతో గంటల తరబడి నిలబడిన పేషెంట్లు అలసటతో బాధపడుతూ నర్సులను ఆశ్రయించినా, వారివద్ద కూడా సరైన స్పందన లభించడం లేదని బాధితులు చెబుతున్నారు.

డ్యూటీకి రాని డాక్టర్లకు జీతాలు ఎందుకు?” అని పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?. “మధ్యాహ్నం వచ్చి గంటలో వెళ్లే వారికి లక్షల రూపాయల జీతాలు ఎందుకు ఇవ్వాలి?” అంటూ ప్రశ్నిస్తున్నారు?.

ప్రజలను పట్టించుకోని డాక్టర్లు,అని ఆసుపత్రి వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.వెంటనే చర్యలు తీసుకుని వైద్య సేవలను మెరుగుపరచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.