వేద న్యూస్, వరంగల్ క్రైమ్:

విధి నిర్వహణతో పాటు సమాజ సేవలోనూ తాము ముందుంటామని ఓ కానిస్టేబుల్ నిరూపించారు. మండుటెండలో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలికి ఏఆర్ (స్పెషల్ పార్టీ) కానిస్టేబుల్ సహాయం చేసి తన మానవత్వం చాటుకున్నారు.

బుధవారం కాజీపేట ఫాతిమా జంక్షన్ వద్ద ఎండలో రోడ్డు దాటేందుకు అవ్వ ఇబ్బంది పడుతోంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఆమెను గమనించాడు. వెంటనే అవ్వని రోడ్డు దాటించి..ఎక్కడకి వెళ్లాలి అని అడిగి ఆటోలో ఎక్కించి పంపించాడు.