వేద న్యూస్, హైదరాబాద్ :

ఔట్సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లించాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ మహాధర్నా సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన శాసన మండలి ఎమ్మెల్సీ అంజిరెడ్డి వినతి పత్రం అందజేసిన జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. గత 6 నెలలగా ఎన్ హెచ్ఎం ఉద్యోగులకు వేతనాల చెల్లించట్లేదు , తక్షణమే విడుదల చేయాలని, ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ..6 నెలలుగా వేతనాలు అందక పోవడంతో ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పిల్లల విద్య ఫీజులు, పాల బిల్లు, ఈ.ఎమ్.ఐ.లు, మరియు నిత్యవసర వస్తువులు కొనలేని దీనస్థితిలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు ఉన్నారని తెలియజేశారు. కావున ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు ప్రభుత్వం చెల్లించాలని, మహిళ ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, డిమాండ్ చేశారు. ఎన్ హెచ్ఎంలో పనిచేస్తున్న కొంత మంది ఉద్యోగలును అవుట్సోర్సింగ్ లోకి మార్చారు దాన్ని యధావిధిగా మల్ల కాంట్రాక్ట్ లోకి కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వాలని, 6 నెలల వేతనాలు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి పెండింగ్ వేతనాలు తక్షణమే చెలించాలని, గత 6 నెలల నుంచి పి.ఎఫ్. డబ్బులు ఉద్యోగుల ఖాతాలో జమ కావడం లేదని అలాగే ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని (లేదా) ప్రభుత్వమే నేరుగా ఉద్యోగుల ఖాతాలో జీతాలు జమ చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సారంగుల బాలసుబ్రమణ్యం, ఔట్సోర్సింగ్ యూనియన్ చైర్మన్ పులి లక్ష్మయ్య, అవుట్సోర్సింగ్ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ , ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు ఎన్. శ్రీనివాస్, పరశురాం, గంగాధర్, జయమ్మ, మరియు చాలా మంది ఉద్యోగులు పాల్గొన్నారు.