- అర్జీదారులు ఇబ్బందులు
- ప్రజాపాలన, గ్రామసభల పేరుతో కార్యాలయం మూసివేతపై ఆగ్రహం
వేద న్యూస్,బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినిపల్లి మండలం కేంద్రంలో గురువారం ఉదయం 11 గంటల వరకూ ఎంఆర్ఓ,కార్యాలయం తలుపులకు, తాళాలు, వేసి ఉండటం ప్రజలను ఆశ్చర్యానికి, గురి చేసింది.
పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన అర్జీదారులు తాళం, వేసిన దృశ్యాన్ని, చూసి నిరాశకు గురయ్యారు.అక్కడ ఉన్న కొంతమందిని ప్రశ్నించగా, ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం మరియు గ్రామసభలు,ఉన్నాయని అందుకోసం తీయలేదు అని సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
అయితే, ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ కార్యాలయం కనీసం తెరిచి ఉంచకపోవడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తక్షణ, సేవలు అవసరమైన సమయంలో కార్యాలయం, మూసివేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు, పడుతున్నారని, అధికారుల, నిర్లక్ష్య వైఖరిపై, చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్, చేస్తున్నారు.