వేద న్యూస్, హనుమకొండ :

హనుమకొండ న్యూ లయోల హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ భద్రకాళీ దేవాలయ ధర్మకర్త గాండ్ల స్రవంతిని స్కూల్ యాజమాన్యం శాలువాతో సన్మానించారు‌‌. ఈ సందర్భంగా గాండ్ల స్రవంతి మాట్లాడుతూ విద్యార్థులందరు వారి టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్దగా వినాలని , విద్యతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు మరియు క్రీడలలో రాణించి న్యూ లాయోల హై స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం తాడిశెట్టి క్రాంతి, కార్తీక్ టీచర్లు ,విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.