వేద న్యూస్, హైదరాబాద్:
బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా గాంధీ భవన్ హైదరాబాద్ లో ఆయన చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.బాబు జగ్జీవన్ రామ్ తన జీవితాంతం అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని, కేంద్ర మంత్రిగా పలు శాఖల్లో సేవలందించి దేశ అభివృద్ధికి తోడ్పడ్డారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుమార్ రావు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.