వేద న్యూస్ ,కారేపల్లి 

ఆటో డ్రైవర్ రవీంద్రచారి అకాల మృతి కుటుంబంలో విషాదం

వెన్నెముక ఆపరేషన్ అనంతరం చికిత్స పొందుతూ మృతి

పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆటో యూనియన్ నేతల విజ్ఞప్తి

సింగరేణి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామానికి చెందిన గంగాధరణి రవీంద్ర చారి (38) అకాల మరణం గ్రామంలో విషాదాన్ని నింపింది. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు.
నిత్యం ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న రవీంద్రచారి పేద కుటుంబానికి చెందినవాడు. రోజువారీ సంపాదనతో జీవనం సాగిస్తున్న ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది.
మృతుడు రవీంద్రచారికి భార్య సౌజన్య, కుమారుడు సాత్విక్ ఉన్నారు. కుటుంబ పోషణ బాధ్యత అంతా రవీంద్రచారిపైనే ఉండటంతో ఆయన మరణం గ్రామస్థులను కూడా కలచివేసింది.
ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు స్పందిస్తూ…
“ఆటో నడుపుకుంటూ జీవించే పేద కుటుంబానికి చెందిన రవీంద్రచారి మృతి బాధాకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి” అని కోరారు.
రవీంద్రచారి మృతి పట్ల గ్రామ ప్రజలు, స్నేహితులు, ఆటో డ్రైవర్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *