వేదన్యూస్ నాగర్ కర్నూల్ :
ధాన్యం తడిసిపోయి దుఃఖంలో ఉన్న రైతన్నలకు పోలీసులు ఆసరాగా నిలిచారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి మార్కెట్ యార్డులోని మొక్కజొన్న పంట తడిసిపోయింది. పంట నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన చెందారు.
విషయం తెలుసుకున్న ఎస్సై సద్దాం, తన సిబ్బందితో కలిసి మార్కెట్ యార్డుకు చేరుకుని తడిసిన ధాన్యాన్ని స్వయంగా బుట్టల్లోకి నింపి, సురక్షిత ప్రాంతానికి తరలించడంలో రైతులకు సాయం నిలిచారు.
