పోతననగర్  శ్మశాన వాటికలో దారుణ పరిస్థితులు

అంధకారంలో అంతిమయాత్రలు… ప్రజల ఆవేదన

వరంగల్ నగరంలోని పోతన నగర్ శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేవు. రాత్రి వేళల్లో శ్మశాన వాటిక పూర్తిగా అంధకారంలో మునిగిపోతుండటంతో అంత్యక్రియలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కరెంటు లేదు – వెలుతురు లేదు

శ్మశాన వాటికలో ఒక్క వీధి దీపం కూడా సరిగా లేకపోవడంతో రాత్రి సమయంలో భయానక వాతావరణం నెలకొంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సౌకర్యం సరిగా లేకపోవడంతో అంత్యక్రియల సమయంలో అవసరమైన నీటి సదుపాయం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మెయింటెనెన్స్ పేరే లేదు శుభ్రత, సంరక్షణ పూర్తిగా గాలికొదిలేయడంతో శ్మశాన వాటిక నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. తక్షణమే స్మశాన వాటికలో విద్యుత్ దీపాలు, తాగునీటి సదుపాయం, శుభ్రత, భద్రత వంటి కనీస వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *