వేదన్యూస్ తెలంగాణ

రాష్ట్రస్థాయిలో 1వ ర్యాంక్ సాధించిన నామాల లోకేష్

హర్షం వ్యక్తం చేసిన స్కూల్ చైర్మన్ గంట రవికుమార్

వరంగల్ పాలిసెట్-2026 ఫలితాల్లో శివనగర్ గోల్డెన్ ఓక్ స్కూల్ విద్యార్థి నామాల లోకేష్ అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో అరుదైన ఘనత సాధించారు. తాజాగా విడుదలైన పాలీసెట్ ఫలితాల్లో నామాల లోకేష్ ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 1వ ర్యాంక్, ఎంబీఐపీసీ వి భాగంలో రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంక్ సా ధించి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. తీవ్ర పోటీ నెలకొన్న పాలీసెట్ ప రీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని పాఠశాల యాజమాన్యం, ఉపా ధ్యాయులు అభినందించారు. విద్యార్థి సాధించిన విజయంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ పాఠశాలలో సంబురాలు జరుపుకున్నారు.

గోల్డెన్ ఓక్ స్కూల్ అందించిన నాణ్యమైన విద్య, ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధ, నిరంతర పర్యవేక్షణ Golden Ok పల్లే ఈ ఫలితం సాధ్యమైందని తెలిపారు. ఈ సందర్భంగా గోల్డెన్ ఓక్ స్కూల్ చైర్మన్ గంట రవికుమార్ మాట్లాడుతూ.. నామాల లోకేష్ మొదటి నుంచి చదువులో ఎంతో ప్రతిభ కనబరిచే విద్యార్థి అని తెలిపారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, లక్ష్యసాధనపై పట్టుదలతోనే రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించగలిగారని పేర్కొన్నారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ విజయంతో గోల్డెన్ ఓక్ స్కూల్ మరోసారి విద్యారంగంలో తన ప్రత్యేక తను చాటుకుందని చెప్పారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *