• చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ

వేద న్యూస్, మందమర్రి :

ఇందిరమ్మ రాజ్యం లోనే ఇంటింటా వెలుగులని ఇందిరమ్మ హాయం లోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సూపరి పాలనకు తోడుగా నిలువాలని గడ్డం వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ అన్నారు. సోమవారం పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలోని 20వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు మహిళలు వారి సమస్యలు చెప్పుకుంటూ కంటతడి పెట్టారు.

అనంతరం వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ మాట్లాడుతూ, రాష్ట్రంలో త్వరలో ఏర్పడబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఇక పేదల కష్టాలు అన్ని తీరుతాయని ధైర్యం చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ప్రతి పేదవాని కష్టం తీరుతుందని అన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని మండిపడ్డారు. కేవలం ఒక రెండు జతల బట్టలతో వచ్చిన సుమన్ వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడని తెలిపారు.

అభివృద్ధి అంటే వీధుల్లో లైట్లు పెట్టడం కాదని ప్రజల జీవితాల్లో మార్పు రావాలని అప్పుడే నిజమైన అభివృద్ధి అని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ హామీలను తక్షణమే అమలు చేస్తుందని అన్నారు. రానున్న ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి వివేక్ వెంకటస్వామిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు, సోత్కు సుదర్శన్, నోముల ఉపేందర్ గౌడ్, కడారి వీరస్వామి, సొత్కు రాజయ్య, బుర్ర రాజు గౌడ్, పోచంపల్లి లక్ష్మి, చంద్రకళ, రమాదేవి, సోత్కు ఉదయ్, ఆకుదారి శ్రీనివాస్, సూపర్ శ్రీనివాస్, బెల్లి నరసింహ, సాయి, సుంకరి ప్రకాష్ రావు, రావుల శ్రీనివాస్, కళ్యాడపు రాకేష్, వెల్ది సాయి కృష్ణ, కళ్యాడపు కళ్యాణ్, సొప్పరి రాజకుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.