వేదన్యూస్
స్వచ్ఛందంగా సెక్స్ వర్క్ చేసే వయోజనులపై దాడులు చేయడం, క్రిమినల్ కేసులు పెట్టడం చట్టవిరుద్ధమని SC వ్యాఖ్యానించింది. వారిని వదిలి, మహిళలు, మైనర్లను అక్రమ రవాణా చేసే మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న వారికి, బలవంతంగా రొంపిలోకి లాగబడిన బాధితులకు మధ్య తేడాను గుర్తించాలంది. హ్యూమన్ ట్రాఫికింగ్‌ను అరికట్టడంపై కోర్టు ఇవాళ మార్గదర్శకాలు జారీచేసింది.