వేదన్యూస్
NEET పేపర్ లీక్ ఘటనపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. NTA సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, హై లెవెల్ కమిటీ చీఫ్, ఇస్రో మాజీ ఛైర్మన్ రాధాకృష్ణన్ విచారణకు హాజరయ్యారు. గతంలో మానిటరింగ్ కమిటీ రికమెండేషన్స్ పాటించినా లీక్ ఎలా జరిగిందని SC ప్రశ్నించింది. లక్షలాది యువత, వారి కుటుంబాలను క్షోభకు గురిచేయడం సరికాదని వ్యాఖ్యానించింది. UPSCని చూసి నేర్చుకోవాలని హితవు పలికింది.