వేదన్యూస్ కమలపూర్
కమలాపూర్ మండలం ఉప్పల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. పని ప్రదేశంలో 480 మంది కూలీలు హాజరుకావడం, వారికి తాగునీరు, టెంట్లు, ఓఆర్ఎస్ వంటి వసతులు కల్పించడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగంగా చేస్తుండటంపై అధికారులను అభినందించిన కలెక్టర్, కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.