వేదన్యూస్ ఖిలా వరంగల్

ఖిలా వరంగల్ తూర్పు కోట బండ రోడ్ నుండి ఎస్సీ కాలనీ, ముదిరాజ్ వాడకు వెళ్లే ప్రధాన రహదారిని తవ్వి నెలలు గడిచినా ఇప్పటివరకు పనులు పూర్తి చేయకపోవడంపై స్థానిక ప్రజలు, నరకయాతన పడుతున్నామనీ ప్రజలు
MCPIU ఖిలా వరంగల్ ఏరియా కమిటీ నాయకులకు వారి బృందని తెలియజేశారు.

ఈ రహదారి గుండా ప్రతిరోజూ వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, వాహనదారులు కంకర రోడ్డుపై ప్రయాణిస్తూ జారి పడుతున్నారని తెలిపారు. పాత రోడ్డును తవ్వి కొత్త రహదారి వేయకుండా కేవలం కంకర పోసి వదిలేయడంతో ప్రజలు నడవడానికి ఇబ్బందిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పనుల ఆలస్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
వర్షాలు పడితే రహదారి మొత్తం బురదమయంగా మారి ప్రమాదాలకు దారితీస్తోందని, రాత్రి సమయంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావడానికే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.
అధికారులు మరియు మంత్రి కొండా సురేఖ సమస్యను పట్టించుకోవడం లేదని, ఏ కారణంతో రోడ్ పనులు ఆలస్యం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని స్థానిక మహిళలు, డిమాండ్ చేశారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే రోడ్డు పనులు పూర్తి చేసి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సుంచు జగదీశ్వర్ mcpiu నగర సహాయ కార్యదర్శి డిమాండ్ చేశారు
ఈకార్యక్రమంలో mcpiu తూర్పు కోట శాఖ కార్యదర్శి రాయినేని ఐలయ్య నగర నాయకులు నాలివలా రవి బంగారు రామస్వామి సుంచు సరోజన బుజ్జి బోలుగుడు రాములమ్మ ఈశ్వరమ్మ వినోదా రాజు శ్రీనివాస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *