వేద న్యూస్, పాలిటిక్స్ :
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ముఖ్యంగా తమిళనాడు సీఎం విజయ్‌తో ఆమె రిలేషన్షిప్లో ఉన్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ రూమర్లపై ఇప్పటివరకు త్రిష నేరుగా ఎక్కడా స్పందించలేదు. కానీ, తాజాగా ఆమె పెట్టిన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా వైరల్‌గా మారింది.తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లకు, నెగెటివ్ ట్రోలింగ్స్‌కు ఆమె తనదైన శైలిలో పరోక్షంగా చెక్ పెట్టారు. త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన పెంపుడు కుక్క నిద్రిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. దానికి ఒక ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించారు.
“నా వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకునేందుకు దీనికి (పెంపుడు కుక్కకు) మాత్రమే అనుమతి ఇస్తాను” (The only one I allow in my business) అని ఆమె ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ద్వారా తన వ్యక్తిగత విషయాలపై ఇష్టం వచ్చినట్లుగా రూమర్స్ సృష్టిస్తున్న వారికి, హద్దులు దాటి ట్రోల్స్ చేస్తున్న వారికి త్రిష పరోక్షంగా గట్టి బుద్ధి చెప్పినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రిష చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. త్రిష అభిమానులు ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ, ఆమె తీసుకున్న బోల్డ్ స్టాండ్‌ను ప్రశంసిస్తున్నారు.