• ప్రజల మనిషిగా గుర్తింపు
  • బహుజన బిడ్డగా దూసుకెళ్తున్న నేత
  • స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బలమైన పోటీ
  • నిండుగా, మెండుగా యువత అండదండలు
  • ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వ్యక్తిత్వం

వేద న్యూస్, భూపాలపల్లి:
భూపాలపల్లి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ రవి పటేల్ బరిలో దూసుకుపోతున్నారు. ఈవీఎంలో తన గుర్తు సీరియల్ నెం.17 ఏసీ(ఏయిర్ కండిషనర్) గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. తీన్మార్ మల్లన్న టీం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కమిటీ మెంబర్ గా ఉన్న రవిపటేల్..భూపాలపల్లి నియోజకవర్గవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.

నిత్యం జనానికి అండదండలు ఇవ్వడంతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మనస్తత్వం కలిగిన రవిపటేల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో సత్తా చూపుతారని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా, నియోజకవర్గవ్యాప్తంగా దాదాపుగా అన్ని గ్రామాల్లో ప్రజలను కష్ట, నష్టాల్లో ఆదుకున్న రవిపటేల్ కు యువత, జనత మద్దతు, అండదండలు నిండుగా, మెండుగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బహుజన బిడ్డగా ప్రజల ముందరకు వస్తున్న తనను ఆదరించి..ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజానీకాన్ని తీన్మార్ రవిపటేల్ కోరుతున్నారు. ప్రజా సమస్యల ఎజెండాగా విద్య, వైద్యం, సత్వర న్యాయం, రైట్ టు రీకాల్ తో పాటు అవినీతి లేని పరిపాలన చేసేందుకు ఒక బహుజన బిడ్డగా జనం ముందుకు వస్తున్న తనకు మద్దతు తెలపాలని అభ్యర్థిస్తున్నారు. 30 వేల మంది తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులతో యువత అండదండలున్న రవిపటేల్..నియోజకవర్గంలో సైలెంట్ గా ఓట్ల విప్లవం తీసుకొస్తారని ఆయన అనుయూయులు అంటున్నారు. చూడాలి మరి..ఏం జరుగుతుందో..భూపాలపల్లి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా రవిపటేల్ ఏ మేరకు ప్రభావం చూపుతారో..