వేద న్యూస్, వరంగల్ టౌన్ :

సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు సభ్యులు డాక్టర్ అనితారెడ్డి నగరంలోని కన్నతల్లి వృద్ధ ఆశ్రమము సందర్శించి, వారి వివరాలు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ “ తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం – 2007” ఎన్నో అవకాశాలను కల్పించదని, చట్టాన్ని, ట్రిబ్యునల్ సేవలను అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. ట్రిబ్యునల్ తరపున వయోవృద్ధులకు చేయవలసిన వన్ని చేస్తామని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు నిరాదరణకు గురైన వృద్ధులకు ఆశ్రమం ఇచ్చి సేవ చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నా చివరిదశలో కుటుంబ సభ్యులదగ్గర లేకపోవటం బాధగా ఉందని అన్నారు. వృద్ధాప్యము ఎవరికి శాపంగా మారకూడదని, ప్రతి ఒక్కరూ తోచిన మేర సహాయసహకారాలు అందించాలని అన్నారు. పిల్లలు తలిదండ్రులనన ఇబ్బంది పెడితే ట్రిబ్యునల్ కి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

సంస్థలు నడిపేవారు చట్ట పరమైన నిబంధనలు పాటించాలని లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. వృద్ధులను జాగ్రత్తగా, ప్రేమ గా చూసుకుంటున్న నిర్వాహకులు రాజన్ బాబు ఇతర సిబ్బందిని అభినందించారు. సంస్థ తరపున అనితా రెడ్డి ని నిర్వాహకులు సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *