వేద న్యూస్, ఖిలా వరంగల్ : 

మిల్స్ కాలనీ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ కర్రె స్వామిని బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ రఫీ శాలువా కప్పి సత్కరించారు. అనంతరం సీఐకి మండల పరిస్థితులపై మాట్లాడుతూ రైల్వేస్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమలు జరగకుండా, అలాగే శివనగర్ ప్రాంతాల్లో బెల్ట్ షాపులను అరికట్టిలని,చింతల్ ప్రాంతంలో ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితులను తక్షణమే పట్టుకోవాలని ఆ ప్రాంతాల్లో పెట్రోలింగ్ ని సాయంత్రం వేళల్లో పెంచాలని కోరారు.తదనంతరం ప్రజలు విదిల్లో శాంతియుతంగా ఉండేందుకు నాయకులు కృషి చేయాలని సీఐ సూచించారు.

 

ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బొజ్జ రంజీత్,శివనగర్ మండల ప్రధాన కార్యదర్శి వైట్ల గణేష్,సీనియర్ నాయకులు ఇనుముల అజయ్,మండల ఉపాధ్యక్షులు పిట్టల వెంకన్న,సీనియర్ నాయకులు జన్ను ప్రభాకర్,ఓబీసీ డివిజన్ అధ్యక్షులు బోడకుంట్ల శివశంకర్,బూత్ అధ్యక్షులు శెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *