వేదన్యూస్ వరంగల్ 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ వేడుకలు ఘనంగా కొనసాగుతున్న నేపథ్యంలో, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆసియాలోనే అతిపెద్ద ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎదుట తెలంగాణ రక్షణ సేన పాంచజన్యలో భాగంగా ఒకటైన “రైతే రాజు” అనే విధానం ప్రకారం వ్యవసాయ మార్కెట్ ముందు టీఆరెస్ జెండా పండుగను వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత నూతనంగా ఏర్పాటు చేసిన జెండా గద్దెను ఆవిష్కరించి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.

వరంగల్ ఈస్ట్, వెస్ట్ ఇన్‌చార్జ్ వెలిగేటి రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ కార్మికులు కవితకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్లలో జెండా గద్దెల ఏర్పాటు బాధ్యతను వెలిగేటి రవికుమార్‌కు కవిత అప్పగించారు. అనంతరం ఆయన నివాసానికి చేరుకుని పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. అలాగే రవికుమార్ రూపొందించిన జెండా గద్దె నమూనాలను, తయారవుతున్న గద్దెలను పరిశీలించి పలు సూచనలు చేశారు.

రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజల మధ్య పార్టీని మరింత విస్తరించాలని రవికుమార్‌కు సూచించారు. అలాగే ఆయన నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ అమరుల త్యాగాలు, రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తికి గుర్తుగా జెండా పండుగను నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి డివిజన్ వారీగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

వెలిగేటి రవికుమార్ మాట్లాడుతూ, పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు గ్రేటర్ వరంగల్ పరిధిలో పార్టీ శ్రేణులను ఏకం చేస్తూ, ప్రతి డివిజన్‌లో పార్టీ జెండా రెపరెపలాడేలా కృషి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అబ్జర్వర్లు, జిల్లా అబ్జర్వర్లు, వివిధ నియోజకవర్గ ఇంచార్జిలు, సీనియర్ నాయకురాలు నూరున్నిస, మానుపాటి రమేష్, పోగుల సుతేజ్, భరత్, గణేష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *