- ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ ప్రకటన
- ఏసీ గుర్తుకు ఓటేసి తీన్మార్ రవిపటేల్‌ను గెలిపించాలని పిలుపు
- బహుజనవాది, ప్రజాశ్రేయస్సు కోరే వ్యక్తికి అండగా ఉండాలని అభ్యర్థన
వేద న్యూస్ , భూపాలపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టౌన్ లో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల భవనంలో తీన్మార్ మల్లన్న టీం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు, భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ రవి పటేల్‌కు మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ మున్నూరుకాపు యువత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ పటేల్ ప్రకటించారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూపాలపల్లి నియోజకవర్గంలో మున్నూరుకాపు ముద్దు బిడ్డ, యువకుడు తీన్మార్ రవి పటేల్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారని, భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న మున్నూరుకాపులు అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పారు.
మున్నూరు కాపు ప్రజానీకం అందరూ కూడా ఈసారి రవి పటేల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను కోరుతున్నానని తెలిపారు. ఈవీఎంలో సీరియల్ నెం.17..ఏసీ(ఏయిర్ కండిషనర్) గుర్తు మీద ఓటు వేయాలని అభ్యర్థించారు.
ప్రతీ మున్నూరు కాపు బిడ్డ..ఈ విషయమై చర్చించుకుని అధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులు, ఇతర బహుజన కులాలందరినీ కలుపుకుని రవి పటేల్ ను..గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేవలం ఎన్నికలు అనగానే మద్యం డబ్బులు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతూ రెడ్డి..వెలమ వారు అధికారంలోకి వస్తున్నారని ఆరోపించారు.
ఒక సామాన్య బీసీ బిడ్డగా, ప్రజల పక్షాన నిలబడుతూ జిల్లాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ‘‘నేనున్నానంటూ’’..మంచి, చెడులకు ప్రజల మధ్యలో రవిపటేల్ ఎప్పటికప్పుడు ఉంటున్నారని చెప్పారు. ఎంతో మందికి వైద్యం విషయమై ఆపరేషన్లు, ఇతర ఆర్థిక సహాయాలు చేశారని గుర్తుచేశారు.
ప్రజల సమస్యల మీద ఎప్పటికప్పుడు పోరాడుతూ…ప్రజల పక్షాన నిలబడిన యువ బహుజనుడిని..నాయకుడిని గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్, సంగం రాష్ట్ర కార్యదర్శి ఇమ్మిశెట్టి మోహన్, బొడ్డు శేఖర్, తూముల ప్రణీత్, కృష్ణ, అనిల్ కౌటం, సురేందర్, చల్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.