వేద న్యూస్, వరంగల్ టౌన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తేజావత్ వెంకన్నను శుక్రవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్( సీఐటీయూ) సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జన్ను.ప్రకాష్, జిల్లా అధ్యక్షులు సింగారపు కృష్ణ, నాయకులు కోమల, ఆర్ సాంబయ్య,జే రామకృష్ణ, జలగం. కుమార్, కోమ్ముదాసు, కిరణ్ తదితరులు ఉన్నారు.
