వేద న్యూస్, వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజకవర్గంలోని లేబర్తి గ్రామంలో ఖమ్మంపాటి యాకమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ప్రశంసనీయంగా జరిగింది. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ శిబిరం పలువురు లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ఖమ్మంపాటి రఘువీర్ ను కార్తీక్ గౌడ్, అఖిల్ కంది, నరేష్ చిన్నపల్లి, రోమన్ మొహ్మద్, ప్రణీత్, ఫరఖాన్ మొహ్మద్ లు శాలువాతో ఘనంగా సత్కరించి, సమాజ సేవ పట్ల ఆయన చూపుతున్న అంకితభావాన్ని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించి, మరెంతో మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని ఆకాంక్షించారు.
