- బెస్ట్ డాక్టర్‌గా పేరు గడించిన ‘ఎనగందుల’
- ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్‌గా సేవలు
- ఆదిత్య మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో 24/7 అందుబాటులో..
వేద న్యూస్, జమ్మికుంట:
తెల్లకోటు ధరించి ప్రజలకు చక్కటి వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ఆయన మారుమూల తెలంగాణ ప్రాంతం నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లో మాత్రమే కాదు..మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ (ఒమన్)లోనూ డాక్టర్‌గా బెస్ట్ సర్వీసెస్ అందించారు. జమ్మికుంట పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు ఆయన ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. పట్టణంలోని ఆదిత్య మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో 24/7 ఆయన అవేలబుల్‌గా ఉంటారని, ఆయన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ ఎలుక దేవేందర్‌రెడ్డి కోరారు.
సేవే లక్ష్యం..
హుస్నాబాద్‌లో జన్మించిన మహిపాల్ చిన్న నాటి నుంచి చదువులో రాణిస్తూ ముందుకు సాగారు. హనుమకొండ భీమారంలోని శ్రీ విద్వాన్ జూనియర్ కాలేజీలో బైపీసీ పూర్తి చేసిన ఎనగందుల మహిపాల్.. ఎంబీబీఎస్ రిమ్స్ కడపలో చదివారు.
అనంతరం కడప ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసి..జనరల్ సర్జరీ(డీఎన్‌బీ)ని హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లో ట్రామా సర్జరీ, క్రిటికల్ కేర్ యూనిట్‌లో బెస్ట్ వైద్య సేవలు అందించారు.
ఒమన్ దేశ వైద్య మంత్రిత్వ శాఖలో అప్పర్ జీ.ఐ సర్జన్‌గా ట్రామా సర్జరీ, క్రిటికల్ కేర్‌లో(జేపీఎన్ఏటీసీ)లో పని చేశారు. ఇంతటి అరుదైన నిపుణత, అనుభవం కలిగిన వైద్య నిపుణులు ఎనగందుల మహిపాల్ సేవలను జనం చక్కగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా వారికే మేలు జరుగుతుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
వైద్యుడిగా విశిష్ట అనుభవం కలిగన మహిపాల్ జీవిత భాగస్వామి కూడా వైద్యురాలే. డాక్టర్ విలియం హాల్‌స్టెడ్, డాక్టర్ బ్లమ్‌గార్ట్, డాక్టర్ ఘన్‌శ్యామ్ వైద్య, డాక్టర్ జీ.వీ.రావు తనకు వైద్యరంగంలో స్ఫూర్తిప్రదాతలని డాక్టర్ మహిపాల్ వెల్లడించారు. పిత్తాశయ రాళ్లు, మూలవ్యాధి – పైల్స్, గుద నాళపు ఫిస్టులా, హెర్నియా, అపెండిక్స్, చీము గడ్డ వంటి తదితర ల్యాపరోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా డాక్టర్ మహిపాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంతటి విశిష్టమైన ఎక్స్‌పీరియెన్స్ కలిగిన డాక్టర్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
