ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
వేద న్యూస్ , ఎల్కతుర్తి:
చింతలపల్లి అంగన్వాడి కేంద్రం లో గురువారం తల్లిపాల వారోత్స వాలను నిర్వహించారు. ఈ కార్య క్రమానికి అంగన్వాడి టీచర్ మాలతి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిపాలు శిశువుల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని ప్రతి తల్లి తన శిశువుకు ఆరు నెలల పాటు పూర్తిగా తల్లిపాలు ఇవ్వాలని సూచించారు.
తల్లిపాల ప్రాధాన్యం శిశు పోషణ తల్లి ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతుందని అంగన్వాడి టీచర్ మాలతి తెలిపారు. పాల్గొన్న మహిళలకు పోషకాహారం శుభ్రత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానంపై సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, ప్రీ స్కూల్ పిల్లల తల్లులు పాల్గొన్నారు.