ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

వేద న్యూస్ , ఎల్కతుర్తి:

చింతలపల్లి అంగన్వాడి కేంద్రం లో గురువారం తల్లిపాల వారోత్స వాలను నిర్వహించారు. ఈ కార్య క్రమానికి అంగన్వాడి టీచర్ మాలతి అధ్యక్షత వహించారు.

 

 

సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిపాలు శిశువుల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని ప్రతి తల్లి తన శిశువుకు ఆరు నెలల పాటు పూర్తిగా తల్లిపాలు ఇవ్వాలని సూచించారు.

తల్లిపాల ప్రాధాన్యం శిశు పోషణ తల్లి ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతుందని అంగన్వాడి టీచర్ మాలతి తెలిపారు. పాల్గొన్న మహిళలకు పోషకాహారం శుభ్రత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానంపై సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, ప్రీ స్కూల్ పిల్లల తల్లులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *