వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ పెరిగింది. మాజీ మంత్రి, కొండా సురేఖ చేసిన తాజా సోషల్ మీడియా పోస్టు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
“The Wait Is Almost Over… A Big Update Is Coming Soon. Stay Tuned, Telangana!” అంటూ ఆమె చేసిన పోస్టుతో ఇంతకాలం ఎదురుచూస్తున్న ఆ కీలక నిర్ణయం ఏమిటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పోస్టులో నిర్ణయం ఏంటో చెప్పకపోయినా.. “నిరీక్షణ ముగిసింది”, “త్వరలో బిగ్ అప్డేట్” అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలకు సంకేతాలా? అన్న చర్చ మొదలైంది.
ఏం జరగబోతోంది?
కొండా సురేఖ నుంచి రాబోయే ప్రకటనపై అనుచరుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. పదవి, రాజకీయ భవిష్యత్, కీలక నిర్ణయం.. ఇలా అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అయితే అసలు విషయం మాత్రం ఆమె నోరు విప్పే వరకు సస్పెన్స్‌గానే ఉండనుంది. వెయిట్ దాదాపు ఓవర్ అంటూ స్వయంగా సంకేతం ఇచ్చిన కొండా సురేఖ.. ఇక ఏ బాంబు పేల్చబోతున్నారు? తెలంగాణ పాలిటిక్స్‌లో తదుపరి ట్విస్ట్ ఏంటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

