• మర్రివానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం 
  • ఆదిత్య, అమృత ఆస్పత్రుల ఆధ్వర్యంలో..
  •  ప్రజలకు ఫ్రీగా మెడిసిన్స్ అందజేత

వేద న్యూస్, ఇల్లందకుంట:

 ఇల్లంతకుంట మండలం మర్రివానిపల్లి గ్రామంలో బుధవారం జమ్మికుంట ఆదిత్య, అమృత ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల శ్రీనివాస్ జనరల్ మెడిసిన్, డాక్టర్ భరత్ న్యూరాలజిస్ట్ , డాక్టర్ గ్రీష్మ గైనకాలజిస్ట్ ఈ క్యాంపులో పాల్గొన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకి ఉచిత షుగర్ పరీక్షలు చేసి అవసరమైన మందులు పూర్తి ఉచితంగా అందజేశారు.

ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ సర్పంచ్ మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ కడారి పద్మ – నవీన్, వార్డు సభ్యులు జుజాటి శ్రీవాణి, ఎడ్ల చిరంజీవి, ఎరుబాటి నాగరాజు, రౌతు రాజేష్, కోడం సంజీవ్, బైరి రవీందర్, ఏనుగు శోభారాణి ఇతర గ్రామ పెద్దలకు, ఆదిత్య, అమృత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

గ్రామాల్లో పేదలకి ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి, ముందు ముందు వివిధ గ్రామాలకు తమ ఉచిత వైద్య సేవలను అందజేయడంలో ఆదిత్య, అమృత హాస్పిటల్ యాజమాన్యం ముందుంటాయ ని దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *