సోమవారం నుంచి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్లాక్ టీషర్ట్స్ ను ధరించుకోని నిరసనలు తెలియజేయడానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకోని తెలంగాణ భవన్ కు తరలించారు.
ఆ పార్టీ నేతలను అదుపులోకి తీసుకునే క్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకోని అమానుషంగా వ్యవహరించారని వారు ఆరోపించారు.
మహిళలని చూడకుండా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర అగ్రహాం వ్యక్తం చేశారు.
