Thanneeru Harish RaoThanneeru Harish Rao

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో తరలించారు. హరీష్‌రావుతో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

హరీష్‌రావును పోలీసులు ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా నిర్బంధించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ చేపట్టిన ‘సమరభేరి’ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతోంది. ఈ కార్యక్రమం రేపటితో ముగియనున్న నేపథ్యంలో హరీష్‌రావు అరెస్ట్ కావడం బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *