వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : 

తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ నాలుగవ మహాసభలు కరీంనగర్ జిల్లాలో పద్మనాయక ఫంక్షన్ హాల్ లో సెప్టెంబర్ 6 ,7 మరియు 8 తేదీల్లో నిర్వహించారు. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నాను తెలంగాణ ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా రెండవ సారి ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి తను ఎల్లప్పుడు కృషి చేస్తానని తెలిపారు. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నానని తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేయాలని (లేదా) సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన ఎన్నిక కు సహకరించిన ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహకు, జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రెటరీ దేవనబోయిన బాపు యాదవ్ కి మరియు ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులందరికీ పేరు పేరునా ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *