వేద న్యూస్, చిల్పూర్ :
విద్యార్థులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చిల్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చిల్పూర్ మండల ఏమార్వోకు వినతిపత్రం సమర్పించారు. బీజేపీ చిల్పూర్ మండల అధ్యక్షులు గంటె ఉపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు కోరారు. అదేవిధంగా బీజేపీ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా కార్యకర్తలపై పోలీసుల వ్యవహరించిన తీరును మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని, కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెండ్యాల దిలీప్ కుమార్, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఊరటి రాజు, మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ముక్కెర రమేష్ యాదవ్, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు కందుకూరు రజినీకార్, మండల నాయకులు పొలాబోయిన జోగులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
