అంబేద్కర్‌ను కించపరిస్తే ఖబడ్దార్..!
హమారా ప్రసాద్ వ్యాఖ్యలపై పొడిశెట్టి ప్రసాద్ ఆగ్రహం
రాజ్యాంగంపై బురదజల్లే ప్రయత్నాలను అడ్డుకుంటాం
అంబేద్కర్‌పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : పొడిశెట్టి ప్రసాద్
వేద న్యూస్, హనుమకొండ ప్రతినిధి :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై బీజేపీ సానుభూతిపరుడు, వ్యాపారవేత్త హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ కార్యకర్త పొడిశెట్టి ప్రసాద్ అలియాస్ దేవునూర్ ప్రసాద్ ఆరోపించారు. శనివారం అయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేసారు.హమారా ప్రసాద్ వెంటనే తన వ్యవహార శైలిని మార్చుకోవాలని మండి పడ్డారు. హమారా ప్రసాద్ విడుదల చేయనున్న పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని పొడిశెట్టి ప్రసాద్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం, అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు. వెంటనే అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు.