వేద న్యూస్, సినిమా:

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవెయిటెడ్ ‘సలార్’ ట్రైలర్ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తు్న్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దేవ, రాజమన్నార్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ..ఏ పరిస్థితులలో బద్ధశత్రువులుగా మారారు? అసలు వీరిరువురి మధ్య వైరం ఎందుకు వచ్చింది? అనేది ఫిల్మ్ స్టోరీ లైన్ అన్నట్లు తెలుస్తోంది.

 

రెండు భాగాలుగా వస్తోన్న ఈ చిత్రంలో ఖాన్ సార్ అనే అడవిని ఒక ప్రత్యేక ప్రపంచంగా చూపించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. కాగా, రెబల్ స్టార్ ప్రభాస్ ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ నెల 22న ఈ సినిమా విడుదల కానుంది. రెబల్ స్టార్ ప్రభాస్ కు జోడిగా బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతిహాసన్ నటిస్తోంది. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషించగా, ‘కేజీఎఫ్’ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సినిమాను ప్రొడ్యూస్ చేశారు.