• అమ్మవారిపేట జాతర కమిటీ సభ్యులు

వేద న్యూస్, వరంగల్:
అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతరను వైభవోపేతంగా నిర్వహిస్తామని ఆ జాతర కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం ఉర్సు నాగేంద్రస్వామి దేవస్థానం ఈవో కమలా, జాతర చైర్మన్ కొడూరి భిక్షపతి ఆధ్వర్యంలో జాతర కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ మీటింగ్ లో జాతరకు నిధులు, కావలసిన వసతులు, మౌలిక సదుపాయాల గురించి చర్చించారు. వచ్చే ఏడాది(2024)లో జరిగే ఈ జాతర అమ్మవారిపేట 23వ జాతర అని పేర్కొన్నారు. జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క నాయకత్వంలో స్థానిక వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, అధికారులతో కలిసి వారి సమన్వయంతో నిర్వహించాలని అన్నారు.

అందరూ జాతర నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో జాతర ఆర్గనైజర్ దాసి రాందేవ్, జాతర కోశాధికారి బైరి నాగరాజు, బైరి హరినాథ్, స్వామి, కుమారస్వామి, రాంమూర్తి, సుధాకర్, వీరేశం, రమేశ్, మొగిళి తదితరులు పాల్గొన్నారు.