వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో దీప్తి రాథోడ్ అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్..హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

విద్యార్థిని మృతి చెందిన విషయాన్ని హాస్టల్ యజమాన్యం కనీసం పోలీసులకు గాని ఇటు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా వరంగల్ ఎంజిఎం మార్చురి కి తరలించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తోటి విద్యార్థులు ఆరోపించారు. ఈ మధ్యకాలంలో పలు కళాశాలల్లో, హాస్టళ్లలో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. దీప్తి రాథోడ్ మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని ఈ మృతి పట్ల పోలీసు ఉన్నత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘం నాయకుడు వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.