వేద న్యూస్, సుల్తానాబాద్:
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు (93) కన్నుమూశారు. కొద్దిరోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అయాన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు.

రాజమల్లు స్వస్థలం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్. గ్రామపంచాయితీ లో కారోబార్ గా చిన్న ఉద్యోగంతో జీవితాన్ని ప్రారంబించాడు ఎన్టీఆర్ అభిమాన సంఘం స్థాపించి, సర్పంచ్ గా, ఎల్ ఎంబి బ్యాంక్ చైర్మన్ గా, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా, సుల్తానాబాద్ పి ఎ సి ఎస్ చైర్మన్ గా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1994 ఎన్నికల్లో టీడీపీ తరఫున పెద్దపల్లి ఎమ్మెల్యే గా గెలుపొందారు.2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు.