- సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి
వేద న్యూస్, ఎల్కతుర్తి:
రాష్ట్ర సీఎం ఏ.రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులు కోరారు. యూత్ కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు హింగె శ్రీకాంత్ మంగళవారం ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ లో ఈ విషయమై పోలీసులకు కంప్లయింట్ చేశారు.
మంచిర్యాలలో జరిగిన ఓ మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అని అసభ్య పదజాలంతో దూషించి..తెలంగాణ మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ..రాష్ట్రంలోని శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసే విధంగా వ్యాఖ్యలు చేసిన సదరు వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులు కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో యూత్ కాంగ్రెస్ సభ్యులు ఈర భీమ్ రాజ్, అంబాల శ్రీకాంత్, గొడిశాల నరేశ్, ప్రదీప్, అంబాల ప్రభాస్, పల్లెపోగు ప్రణయ్, అంబాల యువరాజు, వీణవంక రమేశ్ ఉన్నారు.